వాణిజ్యపరమైన ఉద్రిక్తల భయాలు మార్కెట్లపై ప్రభావం..! 26 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలు ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, వాణిజ్యపరమైన ఉద్రిక్తల భయాలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. సెన్సెక్స్ ఉదయం 80415.47 పాయింట్లు వద్ద ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొంది చివరికి. 105.79 పాయింట్ల నష్టంతో 80004.06 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 27.40 పాయింట్ల నష్టంతో 24,194.50 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారక నిలువ 84.33 గా ఉంది.